పుంగనూరు - అక్టోబర్ 27 : పుంగనూరు పట్టణం యన్. ఎస్. పేట నివాసి రామచంద్ర సంస్మరణార్థం పట్టణం లోనున్న తెలుగుతల్లి వృద్ధాశ్రమంలో నున్న నిరాశ్రాయులకు అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించి తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు కుమారుడు మురళి
ఈ సందర్భంగా వృద్ధులకు ఆహారం అందించి వారి ఆశీర్వాదాలను పొందారు. తండ్రి జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో పదిలపరచుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల ద్వారా చిరస్మరణీయం చేసుకోవచ్చని మురళి చేపట్టిన ఈ కార్యక్రమం చాటిచెప్పింది


Murali. K





