తంబళ్లపల్లి - అక్టోబర్ 21 : తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా టిడిపి సీనియర్ నాయకుడు దయ్యాల ఈశ్వర్ రెడ్డి సతీమణి దయ్యాల శారదమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో దయ్యాల శారదమ్మ కన్నె మడుగు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల అధికారి శ్రీధర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి, టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు