తంబళ్లపల్లి - అక్టోబర్ 21 : తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా అన్నగారు పల్లెకు చెందిన సీనియర్ నాయకుడు నాగేంద్ర నాయుడు సతీమణి దుర్గాభవాని నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం దుర్గాభవాని తన ఎన్నికల నామినేషన్ పత్రం ఎన్నికల అధికారి శ్రీధర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చంద్రశేఖర్ నాయుడు, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయుడు, పురుషోత్తం, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు