తంబళ్లపల్లె - అక్టోబర్ 11 : తంబళ్లపల్లె నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ తంబళ్లపల్లి మండలం నిర్వాహక దళ్ మెంబర్గా యువ నాయకుడుఎద్దుల నరసింహులు ను అధిష్టానం ఎంపిక చేసింది. తంబళ్లపల్లి మండలంలో యువ నాయకుడుఎద్దుల నరసింహులు తోపాటు గుండ్లపల్లి జనసేన యువ నాయకుడు సిద్ధమల్ రెడ్డి, పరసతోపు పంచాయతీ కె మేకల వారి పల్లెకు చెందిన యువ నాయకుడుబండి మురళీకృష్ణ లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమిటీ సభ్యులు ముగ్గురు మాట్లాడుతూ జనసేన నిర్వాహక దళ్ సభ్యులుగా ఎంపిక చేసినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ తంబళ్లపల్లి మండలంలో జనసేన పార్టీ బలోపేతంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని పారదర్శకంగా అసెంబ్లీ సమన్వయకర్తల దృష్టికి తీసుకెళ్లి తద్వారా పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీకి నివేదిస్తామన్నారు. వీరి ఎంపికపై మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లె నిర్వాహక దళ్ మెంబర్ గా యువ నాయకుడు ఎద్దుల నరసింహులు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: జనరల్ న్యూస్ ప్రచురణ తేదీ: 11 October 2026 08:17 PM
Srivani





