తంబళ్లపల్లె - అక్టోబర్ 11 : శనివారం తిరుపతిలో ప్రధాని మోదీ పాతికేళ్ల ప్రస్థానం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాలకృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా తిరుపతి ఎయిర్ పోర్టులో కేంద్ర ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు సువేష్ కుమార్ రామ్ తోపాటు ఎమ్మెల్యేలు, నాయకులకు తంబళ్లపల్లె మండలం నుండి వచ్చిన డప్పు కళాకారులు ఘన స్వాగతం పలకడం చరిత్రలో నిలిచిపోయినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రధాని మోదీ భారీ కటౌట్ ఏర్పాటు, తిరుపతి పురవీధుల్లో డప్పు కళాకారుల విన్యాసాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం కావడం హర్షనీయమన్నారు
తిరుపతి సేవా సంకల్ప అభియాన్ విజయవంతం పై కృతజ్ఞతలు -బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాల
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: జనరల్ న్యూస్ ప్రచురణ తేదీ: 11 October 2026 08:05 PM
Srivani





