తంబళ్లపల్లె - అక్టోబర్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం నాడు స్వర్గీయ ఎన్టీఆర్ పునాది వేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను అందలానికి ఎక్కించి చరిత్రలో నిలిచాడని రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా బీసీలను మోసం చేసి 24 శాతానికి రిజర్వేషన్లు కల్పించి వారి రాజకీయ జీవితాన్ని అంధకారం చేశారని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు తో ఎన్నికలకు సిద్ధమైతే కోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా టిడిపి 34% పైగా బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటానని మంత్రివర్గ తీర్మాణంలో చెప్పడం ఆయన బీసీ పక్షపాతిగా నిలిచాడనడానికి నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలోటిడిపి, కూటమి నాయకుల గెలుపును అడ్డుకోలేరని క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు
బీసీలను నాడు ఎన్టీఆర్ - నేడు చంద్రబాబు భుజాన మోస్తున్నారు - రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: జనరల్ న్యూస్ ప్రచురణ తేదీ: 11 October 2026 07:52 AM
Srivani





