తంబళ్లపల్లె - అక్టోబర్ 10 : ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన పై సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ఫీట్ల అంజలి (రాజనాల) సారథ్యంలో తంబళ్లపల్లె నుండి వందలాది డప్పు కళాకారులు తిరుపతి వీధులు పిక్కటిల్లేలా తమ నృత్య ప్రదర్శనలతో కేంద్ర ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు సువేష్ కుమార్ రామ్ తో పాటు ఎమ్మెల్యేలు, బిజెపి ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. వారు ఈ కళలను ఆసక్తిగా తిలకిస్తూ మంత్ర ముగ్ధులయి ఎస్సీ అధికార ప్రతినిధి అంజలిని ప్రశంసలతో ముంచెత్తారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నే ఆర్ ఎన్ తాండ, కొటాల,ఎద్దులవారి పల్లి, ముదివేడు క్రాస్ నుండి డప్పు కళాకారులు గంగాధర్, మాజీ సర్పంచ్ సుధాకర్, శ్రీనివాసులు, రెడ్డప్ప, శంకర, నారాయణ ఆధ్వర్యంలో బస్సుల్లో తిరుపతి కార్యక్రమానికి తరలివచ్చి తమ నృత్య ప్రదర్శనలతో తంబళ్లపల్లె డప్పు కళాకారుల సత్తా చాటి ఆకట్టుకున్నారు


Srivani






