అమరావతి - అక్టోబర్ 10 : ఏపీ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ కోసం రూ.20,369 కోట్లతో 2026-27 వార్షిక ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా 446 కి.మీ. మేర రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించడంతో పాటు సొరంగమార్గాలు, బైపాస్లు నిర్మించనున్నారు. కడప-తమిళనాడు సరిహద్దు, పలమనేరు-కృష్ణగిరి, ముద్దనూరు-కడప, ఆకివీడు-దిగమర్రు, గుడివాడ-హనుమాన్ జంక్షన్, ముదిగుబ్బ-కదిరి హైవేలతో పాటు కడప-రాయచోటి మధ్య గువ్వలచెరువు ఘాట్లో సొరంగం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం కోసం ప్రాతిపదికలు సిద్ధం చేశారు.