మదనపల్లె - అక్టోబర్ 10 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరిని పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
శనివారం మదనపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాందాస్ చౌదరి మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముందుకు సాగుతామని తెలిపారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసేందుకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో అబ్జర్వర్లు, సమన్వయ కమిటీలు, సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు రాందాస్ చౌదరి వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించే ప్రతి స్థానంలో విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అరాచక పాలన చోటుచేసుకున్నాయని రాందాస్ చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరారు.
రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన రాందాస్ చౌదరిని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీపతి, పార్లమెంట్ కమిటీ సభ్యుడు ప్రదీప్ సింగ్, సపోర్ట్ టీం సభ్యుడు అడపా సురేంద్ర, బీసీ నాయకులు బండి మనోహర్, జయ భవ్యతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు
Mani Kumar. B






