మదనపల్లె - అక్టోబర్ 17 : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె దొంతి వీధిలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ ఐపీఎస్ పరిశీలించారు. డీఎస్పీ వంశీధర్ గౌడ్, టూ టౌన్ సీఐ గోపాల్ రెడ్డి, ఎస్ఐ నాగేశ్వర్ రావు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని డీఐజీ అధికారులను ఆదేశించారు.


Murali. K






