తంబళ్లపల్లె అక్టోబర్ 16: తంబళ్లపల్లి మండలంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల నియమ నిభంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎంపీడీవో ఉషారాణి తెలిపారు. శుక్రవారం కార్యాలయానికి వచ్చిన ఎన్నికల సామాగ్రిని ఆమె తనిఖీ చేశారు. మండలంలో 40 పోలింగ్ బూత్ లుకు గాను 80 పోలింగ్ బాక్సులు వచ్చినట్లు చెప్పారు. మండలంలో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ పాటించి సహకరించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గతంలో ఏర్పాటు చేసిన నాయకుల ఫ్లెక్సీలు తొలగించాలని, పార్టీల నాయకుల పేర్లు, పార్టీల చిహ్నాలు,శిలాఫలకాల పై పేర్లు, విగ్రహాలు, గోడ రాతలు, గోడ పత్రికలు, పై కానరాకుండా తగిన చర్యలు చేపట్టడానికి మండలంలోని 21 పంచాయతీ ల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కార్యాలయాలు, పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు, గోడ రాతలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు చెప్పారు. వద్ద రాజకీయ నాయకుల సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి రాజకీయ నాయకులు అధికారులకు పూర్తి సహకారం అందించి సహకరించాలని ఆమె కోరారు. ఆమె వెంట డిప్యూటీలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ గోపీనాథ్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యదర్శి ఈశ్వర్రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల నియమ నిభంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎంపీడీవో ఉషారాణి తెలిపారు. శుక్రవారం కార్యాలయానికి వచ్చిన ఎన్నికల సామాగ్రిని ఆమె తనిఖీ చేశారు. మండలంలో 40 పోలింగ్ బూత్ లుకు గాను 80 పోలింగ్ బాక్సులు వచ్చినట్లు చెప్పారు. మండలంలో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ పాటించి సహకరించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గతంలో ఏర్పాటు చేసిన నాయకుల ఫ్లెక్సీలు తొలగించాలని, పార్టీల నాయకుల పేర్లు, పార్టీల చిహ్నాలు,శిలాఫలకాల పై పేర్లు, విగ్రహాలు, గోడ రాతలు, గోడ పత్రికలు, పై కానరాకుండా తగిన చర్యలు చేపట్టడానికి మండలంలోని 21 పంచాయతీ ల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కార్యాలయాలు, పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు, గోడ రాతలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు చెప్పారు. కార్యాలయాలు వద్ద రాజకీయ నాయకుల సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి రాజకీయ నాయకులు అధికారులకు పూర్తి సహకారం అందించి సహకరించాలని ఆమె కోరారు. ఆమె వెంట డిప్యూటీలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ గోపీనాథ్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యదర్శి ఈశ్వర్రెడ్డి అధికారులు పాల్గొన్నారు

ఎన్నికల నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - ఎంపీడీవో ఉషారాణి.