తంబళ్లపల్లె - అక్టోబర్ 16 : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా సంకల్ప అభియాన్ లో బిజెపి అధినాయకుల సహకారం తో డప్పు కళాకారులు 75 గంటల నిర్విరామ డప్పు మోతతో చేసిన ప్రదర్శన ప్రపంచ రికార్డు సాధించి మోడీకి అంకితం చేయడానికి సహకరించిన తంబళ్లపల్లె నియోజకవర్గం డప్పు కళాకారులు , ఎస్సీ మోర్చా ప్రతినిధులకు పేరు పేరునా రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి(రాజనాల)కృతజ్ఞతలతో కొనియాడారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మోడీ సేవా సంకల్ప యాత్రకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పిఎన్ మాధవ్ సారథ్యంలో కార్యక్రమం విజయవంతమైనట్లు చెప్పారు. 75 అడుగుల మోదీ కటౌట్ తో పాటు డప్పు కళాకారుల ప్రపంచ రికార్డు సీఈఓ పవన్ సోలంకి ద్వారా రికార్డు అందుకోవడం ఇందుకు సహకరించిన పీట్ల అంజలి రాజనాల నికొనియాడుతూ ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్, ముఖ్యఅతిథి హాస్యనటుడు బాబు మోహన్, బిజెపి ఆల్ సెల్ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శిరేష్ కుమార్ రామ్, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఎస్సీ మోర్చా ఇన్చార్జి నిర్మలా కిషోర్, అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ వరప్రసాద్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శిలు పాల్గొని కార్యక్రమం విజయవంతం తో పాటు పీట్ల అంజలి రాజనాల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి 300 మంది డప్పు కళాకారుల 75 గంటల నిర్విరామ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సాధించి మోడీకి అంకితం చేయడం పై పీట్ల అంజలి (రాజనాల) ని ప్రశంసల జల్లు కురిపించారు

ప్రధాని మోదీ జన్మదిన సేవా సంకల్ప అభియాన్ విజయవంతం