మదనపల్లె - అక్టోబర్ 15 :bమున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు

     గురువారం మదనపల్లెలోని దొంతి లేఅవుట్ వద్ద మున్సిపల్ వాహన పార్కింగ్ సమీపంలో ఉన్న సహాయ ఎన్నికల అథారిటీ నూతన భవనంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ గదులను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

       ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీల కలెక్టర్‌కు వివరించాఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలు ఎటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి