తంబళ్లపల్లె - అక్టోబర్ 14 : గతంలో కళాకారులు డప్పుల మోతలో ఆస్ట్రేలియాలో 72 గంటల పాటు నిర్విరామ డప్పులమోత మోగించి ప్రపంచ రికార్డు సొంతం కాగా బుధవారం రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాలసారథ్యంలో తిరుపతిలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి వచ్చిన 300 మంది డప్పు కళాకారులు 75 గంటల పాటు తిరుపతి వీధులు మారు మోగేలా నిర్విరామ డప్పుల మోత మోగించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకొని చరిత్ర తిరగరాశారు. తిరుపతిలో నాలుగు రోజులుగా ప్రధాని మోదీ పాతికేళ్ల సుపరిపాలన సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమాలలో ఈ అరుదైన ప్రపంచ రికార్డు నమోదు కావడం ఇందుకు సహకరించిన రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల రాజనాల నీ సర్వత్ర అభినందించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసిన డప్పు కళాకారులను బిజెపి ఏపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, భారతదేశ సీఈఓ సోలంకి, వరల్డ్ రికార్డ్ సీఈఓ పవన్ సోలంకి, ముఖ్య అతిథి బాబు మోహన్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పురుషోత్తం లు ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడం పై అభినందించడంతో పాటు మన సాంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన పురాతన కళలకు జీవం పోస్తున్న కళాకారులను అభినందించారు. అనంతరం వరల్డ్ రికార్డ్ సీఈఓ పవన్ సోలంకి వరల్డ్ రికార్డ్ పత్రాన్ని ఏపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాల కి హర్షద్వానాల మధ్య మెమంటో అందజేశారు

డప్పుల మోత లో ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్ చేసిన ఇండియా