తంబళ్లపల్లె - అక్టోబర్ 13 : తంబళ్లపల్లె మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో స్మశాన వాటికలు లేని గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి తన దృష్టికి తేవాలని వీఆర్వోలను తాసీల్దార్ శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆయన వీఆర్వోల సమీక్షలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి స్మశాన వాటికలు గుర్తించాలన్నారు. మండలంలో పలు పంచాయతీలలో స్మశాన వాటికలు లేక చనిపోయిన వ్యక్తులను తమ పొలాలు, పోరంబోకు స్థలాలు, ఎక్కడపడితే అక్కడ పూడ్చడం జరుగుతోంది. ఇక దళిత గిరిజనులు గ్రామాల సమీపంలో పొలాలు లేక రోడ్లకు ఇరువైపులా లేదా పొలం గట్లపై సవాలు పూడ్చడంపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకపోయింది. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు మేరకు స్మశాన వాటికలో లేని గ్రామాలను గుర్తించి స్మశాన వాటికల కు స్థలాల కేటాయింపు ఇప్పటికైనా జరుగుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.