తంబళ్లపల్లె - అక్టోబర్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని విజయ్ సినిమా టాకీస్ అధినేత బలకవారి పల్లెకు చెందిన బలక చిన్నరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. చిన్న రెడ్డి సినిమా టాకీస్ అధినేతగా వివాదరహిత రాజకీయ నాయకుడిగా మోతుబరి రైతుగా గుర్తింపు పొందాడు. ఆయన మృతి విషయం తెలిసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మంగళవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు, బంధువులు చిన్న రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు