తంబళ్లపల్లె - అక్టోబర్ 12 : మండలంలోని రేణుమాకులపల్లి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లకు మదనపల్లెకు తరలిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి రేణుమాకుల పల్లె పంచాయతీ లోని మారుమూల గ్రామాల ప్రజలతోపాటు ఎద్దులవారిపల్లె, కన్నె మడుగు పంచాయతీలకు చెందిన ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరంలో చికిత్సలు చేయించుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం డాక్టర్లు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు

రేణుమాకులపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం