తంబళ్లపల్లె - అక్టోబర్ 12 : తంబళ్లపల్లె మండలం లోని ప్రభుత్వ భూములను వీఆర్వోలు గుర్తించి వివరాలు నివేదించాలని తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం ఆయన వీఆర్వోల సమీక్షలో మాట్లాడుతూ వీఆర్వోలు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించి రైతుల సమస్యల పరిష్కారం పై చొరవ చూపాలని సూచించారు. మండలంలో జరుగుతున్న భూ రీసర్వేలో ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించాలని కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గత ప్రజాదర్బార్లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో వచ్చిన 53 భూములకు సంబంధించిన సమస్యలు 15 రోజుల్లో పరిష్కారానికి వీఆర్వోలు కృషి చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు రైతుల భూముల సమస్యలు పరిష్కారానికి సహకరించారు. ఈ సమీక్షలో మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు
వీఆర్వోలు మండలంలోని ప్రభుత్వ భూములు గుర్తించండి - తాహాసిల్దార్ శ్రీనివాసులు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: జనరల్ న్యూస్ ప్రచురణ తేదీ: 12 October 2026 08:44 PM
Srivani





