నమిత న్యూస్ పుంగనూరు: " శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకేమరుదు, కాముని తల్లి అట చక్కదనాలకేమరదు, సోముని తోబుట్టువట సొంపు కళలకేమరుదు" అంటూ అన్నమయ్య పరవశించిపోయినట్లుగా చదళ్లలోని శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి శుక్రవారం రోజు స్వర్ణ కాంతులు వెదజల్లే శ్రీ మహాలక్ష్మి గా దర్శనమివ్వడంతో భక్తులు ఆనందంతో పరవశించారు. శుక్రవారం ఉదయం నుంచి వేదపండితుల సారథ్యంలో వేద పారాయణం నిత్య పూజలు అభిషేకాలు శ్రీ చౌడేశ్వరి మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త అయిన వేణుగోపాల్ రెడ్డి ఉషశ్రీ దంపతుల నేతృత్వంలో 108 తామర పుష్పాలతో ప్రత్యేకంగా శ్రీ అష్టలక్ష్ముల హోమం వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్యునకు అర్చకులు శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేపట్టారు. అమృత హస్తాలతో స్వర్ణ రాశుల ధారను కురిపించే కలశాన్ని చేతబట్టిన శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా చదల గ్రామస్తులు మరియు ఎన్వీఆర్ ట్రస్ట్ సారథ్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నల్లగుట్లపల్లి తండా వారు ప్రదర్శించిన డీజే కోలాటం ఆద్యంతము ఉత్సాహపరితంగా సాగింది.


Murali. K






