పుంగనూరు - అక్టోబర్ 15: ఆన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో గురువారం ఐదవ రోజు అన్నపూర్ణాదేవి అర్ధనారీశ్వరి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రాము అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పంచహారతి పూజలు నిర్వహించారు. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారని, ఈ స్వరూప దర్శనంతో దాంపత్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.