పుంగనూరు మండలం చదళ్ళ గ్రామం లో ప్రతి ఏటా విశేష ఆధ్యాత్మిక వైభవాలకు కేంద్రమై నిలుస్తున్న చదళ్లలోని శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బుధవారం శ్రీ ప్రసన్న పార్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి మరియు చదళ్ల గ్రామస్తులు ఎన్.వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఊపందుకున్నాయి. ఉదయం నుంచి ఆలయంలో పురుష సూక్తము నారాయణ సూక్తము మన్య సూక్తాలతో హోమాలు నిర్వహించిన అనంతరం వేణుగోపాల్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి, మహా మంగళహారతి సమర్పించారు.సాయంత్రం పరిసర గ్రామాల నుంచి విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఎన్విఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. సరిగమప పార్వతి నాగార్జున సారధ్యంలో సంగీత విభావరి ప్రజలను రంజింపజేసింది.


Murali. K






