మదనపల్లె మున్సిపాలిటీ బిసి జనరల్ కు రిజర్వ్ అయిన నేపథ్యంలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సోదరుడు గుండ్లపల్లి యోగేశ్వర్ (పెద్దబాబు)కు అవకాశం దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లకు నమ్మకమైన వ్వక్తిగా అభిమానం చురుగొన్న శ్రీరామ్ చినబాబు కావడం, అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో చిన్నబాబుకు సరైన న్యాయం చేయలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చినబాబు సోదరుడు గుండ్లపల్లి యోగేశ్వర్ (పెద్దబాబు)కు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలతో విస్తృత స్థాయిలో సంబంధాలు కలిగిన శ్రీరామ్ చినబాబు చేనేత తొగటవీర క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్వక్తి కావడం గమనార్హం. ‌తెలుగుదేశం పార్టీలో బిసిలకు సముచిత స్థానం వుంది. మదనపల్లె పట్టణంలో విస్తృత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్వక్తి శ్రీరామ్ చినబాబు దగ్గర వుండి తన అన్న గుండ్లపల్లి యోగేశ్వర్ ను గెలిపించు కోవడం తధ్యం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారం అందిస్తే గెలుపు సునాయాసనమే. శ్రీరామ్ చినబాబు అన్న గుండ్లపల్లి యోగేశ్వర్ అభ్యర్థి అయితే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, సీనియర్ నేత రాటకొండ బాబురెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, బిజెపి నేత చల్లపల్లి నరసింహారెడ్డి, కూటమి నేతలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ‌గెలుపు కోసం వార్డుల వారుగా తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులు కలసికట్టుగా పని చేయడం కూడా జరుగుతుంది. మదనపల్లెకు గుండెకాయ లాంటి నీరుగుట్టువారిపల్లి ఏకపక్షంగా నిలవడం తోపాటు తొగట వీర క్షత్రియ సామాజిక వర్గం కలసి వచ్చి గెలిపించి కోవడం తధ్యం. గుండ్లపల్లి యోగేశ్వర్ అభ్యర్థి అయితే మదనపల్లె మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం.