పుంగనూరు - అక్టోబర్ 18 : అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి నయీమా తాజ్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఆదివారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో నయీమా తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది.మున్సిపల్ ఎన్నికల వేళ పుంగనూరులో చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆమె ఏకగ్రీవ ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పుంగనూరు మున్సిపల్ చైర్పర్సన్ గా నయీమా తాజ్ ఏకగ్రీవం
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: రాజకీయం ప్రచురణ తేదీ: 18 October 2026 08:52 PM
Rukmini M 





