చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటేగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైసిపి గెలుపు తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు.
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించాలి - వెంకటేగౌడ
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: రాజకీయం ప్రచురణ తేదీ: 19 October 2026 10:56 AM
Rukmini M 





