రాయచోటి - అక్టోబర్ 12 : భూవివాదం నేపథ్యంలో దాడికి పాల్పడిన నలుగురు నిందితులకు రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించింది.
లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంటపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి, అదే గ్రామానికి చెందిన కొందరితో సర్వే నంబర్ 1178 భూమి విషయంలో వివాదం నడుస్తోంది. 2022 జనవరి 28న భూమిని జేసీబీతో చదును చేస్తుండగా నల్లతిమ్మారెడ్డిగారి చెన్నారెడ్డి, పద్మారాణి, చంద్రశేఖర్ రెడ్డి, నగేష్ కుమార్ రెడ్డి కర్రలతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.
బాధితుడి ఫిర్యాదుతో లక్కిరెడ్డిపల్లి పోలీసులు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో కోర్టు నలుగురికీ శిక్ష విధించింది.
Mani Kumar. B






