మదనపల్లె - అక్టోబర్ 26 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లె లో కాపురం ఉంటూ భూ కబ్జాల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన లేడీ డాన్ గా పేరొందిన కోనేటి సులోచన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడు ను సోమవారం 1వ పట్టణం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ మోహన్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు నీరుగట్టువారిపల్లికి చెందిన కోనేటి సులోచన, అనుచరుడు మోహన్ ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆమెకు ప్రధాన అనుచరుడు, రెడ్డప్ప నాయుడు కాలనీలో కాపురం ఉండే కడియాల శ్రీరాములు నాయుడు సులోచన తో కలిసి మదనపల్లి పట్టణ రూరల్ ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.కోట్ల విలువైన భూములను స్వాహా చేసినట్లు, వెంకటరమణారెడ్డి భూమి ని అన్యాక్రాంతం చేయుటకు యత్నించారని ఫిర్యాదు మేరకు నమోదైన కేసు లో దీంతో స్థానికంగా ఉండే బాదితులు , వెంకటేష్ నాయుడు కలిసి గతంలో అమ్మ చెరువుమిట్ట సమీపంలో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారన్నారు. వెంకటరమణారెడ్డి కి వారసత్వంగా వచ్చిన రెండు ప్లాట్లు, భాగానికి వచ్చిన రెండు ప్లాట్లతో సహా మొత్తాన్ని సులోచన 2021లో వెంకటేశ్ నాయుడు సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందన్నారు. కోనేటి సులోచన తన అనుచరులతో కలిసి వెంకటరమణారెడ్డిపై తరుచూ గొడవలు పెట్టుకుని ఆయన్ను చంపుతామని బెదిరిస్తుండటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనేటి సులోచన, ఆమె తల్లి రెడ్డెమ్మ, సోదరుడు శ్రీనాధ్ అనుచరులు మోహన్, సీటీఎం రోడ్డులోని రెడ్డెప్ప నాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములు నాయుడులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో సులోచన, మోహన్ ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ పేర్కొన్నారు. అలాగే రెడ్డెమ్మ, శ్రీరాములు నాయుడు పరారీలో ఉండేవారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా శ్రీరాములు నాయుడు పట్టుబడడంతో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచడం జరిగిందని చెప్పారు. అలాగే రెడ్డమ్మ పరారీలో ఉందని ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ పేర్కొన్నారు. సులోచనతో పాటు శ్రీరాముల నాయుడు, మోహన్ లపై వన్ టౌన్, టూ టౌన్,తాలూకా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయని భూ కబ్జాలు, దాడులు భయాందోళనలకు పాల్పడితే ఎంతటివారినైనా శిక్షించక తప్పదన్నారు.