పీలేరు - అక్టోబర్ 11 : మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఆర్డీవో కార్యాలయం సమీపంలో బొలెరో పికప్ వాహనం క్రేన్‌ను ఢీకొంది. హైవే కెమెరా మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పుంగనూరు నుంచి తిరుపతికి మొక్కజొన్న కంకుల లోడుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు రక్తగాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

హైవే సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించారు