తంబళ్లపల్లి - అక్టోబర్ 23 : నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి సాగేలా అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు తెలిపారు.

అనుమతి లేకుండా గుంపులుగా రావడం, ర్యాలీలు నిర్వహించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.

ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.