మదనపల్లె - అక్టోబర్ 20: మదనపల్లెలోని దొంతి వీధి నామినేషన్ సెంటర్‌లో అదనపు ఎన్నికల అధికారి బొరయ్యపై దౌర్జన్యం చేసిన రాజేష్‌ ను 2వ పట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం విధులకు ఆటంకం కలిగించిన రాజేష్‌పై కేసు నమోదు చేశారు. ఇతనిపై ఇప్పటికే 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. ఈ ఉదయం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు