ఆత్మకూరు - అక్టోబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరులో భారీగా నగదు పట్టుబడింది. కృష్ణమూర్తి అనే వ్యాపారి ఇంట్లో రూ.42.20 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజినాయక్ తెలిపారు.
పక్కా సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, డిప్యూటీ తహసీల్దార్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల్లో లభించిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు
Rukmini M






