గుఱ్ఱంకొండ - అక్టోబర్ 14 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో రాయచోటి డీఎస్పీ ఎం .ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున గుర్రంకొండ మండలం లోని చెర్లోపల్లి లో పోలీసులు 'కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహించారు.
వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు రవీంద్రబాబు, తిప్పేస్వామి, వాయల్పాడు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో కలిసి ఇంటింటినీ తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు.అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, గ్రామస్తులతో ప్రత్యేకంగా గ్రామసభను ఏర్పాటు చేశారు.ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు ప్రజలను హెచ్చరించారు.


Murali. K






