అమరావతి - అక్టోబర్ 13 : ఏపీలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు
ప్రభుత్వం సిద్ధమంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాం.l
రాజకీయ పార్టీల సమావేశం అనంతరం మీడియా తో ఎన్నికల కమీషనర్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: రాజకీయం ప్రచురణ తేదీ: 13 October 2026 07:46 PM
Rukmini M 





