మదనపల్లి : అన్నమయ్య జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఉషశ్రీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఎంహెచ్‌వోగా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ శ్రీనివాసులు ను నియమించారు. అయితే రెండు చోట్ల విధులు నిర్వహించడం కష్టంగా ఉందని ఆయన ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఉషశ్రీ కి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. డాక్టర్ శ్రీనివాసులు కడప రిమ్స్ ఆస్పత్రి ఆర్‌ఎంవోగా కొనసాగనున్నారు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన ఉషశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి లలో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమని తెలిపారు
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌వో గా డాక్టర్ ఉషశ్రీ
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆరోగ్యం ప్రచురణ తేదీ: 11 October 2026 08:31 AM
Mani Kumar. B 





