తంబళ్లపల్లె - అక్టోబర్ 10 : తంబళ్లపల్లె కస్తూరిబా గురుకుల కాలేజీ 13 మంది విద్యార్థులకు మెడికల్ ఒకేషనల్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించినట్లు శ్రీదివ్య ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ తెలిపారు. శనివారం గురుకుల ప్రిన్సిపాల్ రేష్మ సూచనల మేరకు ఎన్నడూ లేని విధంగా బాలికలకు ముందస్తుగా వైద్య విద్యపై అవగాహన కోసం శ్రీదివ్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ట్రైనింగ్ కు ఇప్పించారు. డాక్టర్ వెంకట్ విద్యార్థులకు బెడ్ మేకింగ్, ఫార్మసీ, బేసింగ్ నర్సింగ్, డ్రెస్సింగ్, ల్యాబ్ సిస్టం, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై పది రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ రాధ, కస్తూరిబా టీచర్ మల్లిక, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు