41, 42వ వార్డుల్లో జనసేన నేతల ఇంటింటి ప్రచారం మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 41, 42వ వార్డుల్లో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి, స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె ఏఎంసీ చైర్మన్ శివరామ్ రాయల్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కూటమి అభ్యర్థులతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు.ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


Mani Kumar. B






