*ఫ్లెక్సీలు, వాల్ రాతలు:*
ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రాతలు ఉండరాదు.
*ప్రలోభాలు:*
ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంచడం లేదా ఉచితంగా వస్తువుల పంపిణీ చేయడం తీవ్ర నేరం.
మత/కుల ప్రచారాలు:* కులాల, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనా మందిరాలను (గుడులు, మసీదులు, చర్చీలు) ప్రచార వేదికలుగా వాడరాదు.
ప్రభుత్వ వనరులు:* అధికార పక్షం వారు ప్రభుత్వ వాహనాలు, నిధులు, భవనాలను లేదా ప్రభుత్వ పథకాల ప్రచారాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
కొత్త పథకాలు/పనులు:* ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కొత్త నిధుల మంజూరు చేయకూడదు.
అనుమతి లేని మైకులు:*
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకులు, లాడ్స్పీకర్లు వాడకూడదు. పగటిపూట కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి.
నగదు రవాణా:*
సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు.
Murali. K






