మదనపల్లి - అక్టోబర్ 11 : మదనపల్లె బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 35 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో మొత్తం 32 మంది విద్యార్థులు పాల్గొనగా, 18 మంది ఎంపికయ్యారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, దేశభక్తిని పెంపొందించడమే ఎన్‌సీసీ ప్రధాన లక్ష్యం. ఎంపికైన విద్యార్థులు శిక్షణ కార్యక్రమాలు, ఎన్‌సీసీ శిబిరాల్లో చురుగ్గా పాల్గొనాలని అధికారులు సూచించారు. జాతీయ సమగ్రత, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగే స్ఫూర్తిని అలవర్చుకోవాలని తెలిపారు.
ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. గుత్తా గిరిబాబు, ఎన్‌సీసీ అధికారులు అభినందించారు. దేశసేవకు యువతను సిద్ధం చేసే ఎన్‌సీసీలో విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు
Venkateswarlu






