ఆత్మకూరు - అక్టోబర్ 27 : ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 30 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
మండలాల వారీగా ఏకగ్రీవ స్థానాల వివరాలు
మర్రిపాడు మండలం -7 స్థానాలు మర్రిపాడు, సింగనపల్లి, భూదవాడ, నందవరం, పొంగూరు, భీమవరం, ఏపిలగుంట 7ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చేజర్ల మండలం – 9 స్థానాలు
టీకేపాడు, పాడేరు, మాముడూరు, నెర్నూరు, వావిలేరు, పుట్టుపల్లి, నాగులవెల్లటూరు, తూర్పుపల్లి, మడపల్లి ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంగం మండలం – 6 స్థానాలు
పడమటిపాలెం, మర్రిపాడు, వంగల్లు, పెరమన, కొరిమెర్ల, జండాదిబ్బ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
AS పేట మండలం – 4 స్థానాలు
గుంపర్లపాడు, సీబీవరం, హసనాపురం, చిరమన ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతసాగరం మండలం – 3 స్థానాలు
బొమ్మవరం, దేవరాయపల్లి బిట్–1, ఆమనిచిరువెళ్ల ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆత్మకూరు మండలం
చెర్లోయడవలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో 30 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని మంత్రి ఆనం నాయకత్వంలో విజయాలు సాధించారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక నాయకుల సమన్వయమే ఈ ఫలితాలకు కారణమని
నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాల్లో 30 స్థానాలు ఏకగ్రీవం కావడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు విశేష విజయంగా అభివర్ణిస్తున్నారు.
మర్రిపాడు, చేజర్ల మండలాల్లో అత్యధిక సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవం కావడంతో పాటు సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోనూ మెజారిటీ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహాన్ని నింపింది
Rukmini M





