రాయచోటి - అక్టోబర్ 27 : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల మదనమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.
లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీగా యనమల మదనమోహన్ ఏకగ్రీవ ఎన్నిక
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 27 October 2026 07:05 PM
Murali. K





