రాయచోటి - అక్టోబర్ 27 :: రామాపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా కేతన్ రెడ్డి హారిప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో హారిప్రియ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో రామాపురం మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోటీ లేకుండానే జడ్పీటీసీగా ఎన్నిక కావడంతో ఆమె అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.