46వ వార్డులో టిడిపి అభ్యర్థిని బొగ్గుల పార్వతిని ఆశీర్వదించండి
- ఓటర్లకు కూటమి నాయకులు విన్నపం
మదనపల్లె : పట్టణంలోని 46వ వార్డులో కూటమి టిడిపి అభ్యర్థి బొగ్గుల పార్వతి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్డులోని ఓటర్లను కలుసుకున్నారు.వార్డు అభివృద్ధికి సహకరించాలని,ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు.ఈ సందర్భంగా బొగ్గుల పార్వతి మాట్లాడుతూ వార్డు ప్రజలకు సేవచేయడమే తన ప్రధాన ఆశయమని తెలిపారు.ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని,ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.అనంతరం పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేసే అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని కోరారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో ఆనందం నింపుతోందన్నారు. Lఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే వార్డు అభివృద్ధితో పాటు పట్టణ పురోభివృద్ధికి కూడా కృషిచేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 46వ వార్డు టిడిపి అభ్యర్థిని పార్వతి,చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబులను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మోడెం సిద్ధప్ప,నీలకంఠ,బండి నాగరాజు తెలుగు యువత నాయకులు
ప్రభు కురబ గౌడ్,పరిమళ,సహదేవ,వినోద్ కుమార్,రమేష్,సురేష్,అరవింద్,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
46వ వార్డులో టిడిపి అభ్యర్థిని బొగ్గుల పార్వతిని ఆశీర్వదించండి - ఓటర్లకు కూటమి నాయకులు విన్నపం
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 27 October 2026 07:01 PM
Mani Kumar. B 





