2వ వార్డులో వైసీపి అభ్యర్థిని శ్వేతశ్రీ ప్రచారానికి విశేష స్పందన
- అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
మదనపల్లి : రెండవ వార్డులో వైసీపి అభ్యర్థిని శ్వేతశ్రీ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.ఇందులో భాగంగా మంగళవారం రెండవ వార్డు పరిధిలోని గురుకుల పాఠశాల,మంజునాథ కాలనీ,అనపగుట్ట,శ్రీవారి నగర్,అయ్యప్ప నగర్,చంద్రాకాలనీలలో ఫ్యాన్ సందడి మొదలైంది.రెండవ వార్డు అభ్యర్థి శ్వేత శ్రీ గెలుపు కోసం,ఆమె భర్త శివకుమార్,మామ,అత్త సాయుకుమార్,లలితమ్మ కలసి నిర్వహించిన మాస్ ప్రచారం శ్వేత శ్రీ గెలుపునకు దిక్సూచిగా మారింది.మదనపల్లి రెండవ వార్డు మునిసిపల్ కౌన్సిల్ పీఠాన్ని మళ్లీ ఫ్యాన్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో,భర్త శివకుమార్ దూకుడు పెంచారు.రెండవ వార్డు అభ్యర్థి శ్వేత శ్రీ తరపున పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కోనేటి దివాకర్ పెద్ద బలంగా మారాడు.ఈ నేపథ్యంలో
వార్డులోకి అడుగుపెట్టిన సాయికుమార్,దివాకర్ కి మహిళలు,యువత బ్రహ్మరథం పట్టారు.ఇంటింటికి తిరుగుతూ జగనన్న చేసిన సంక్షేమ పాలనను,శ్వేత నాయకత్వాన్ని వారు ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా రాగ శివకుమార్ మాట్లాడుతూ శ్వేత శ్రీ గెలిస్తే,వార్డు అభివృద్ధి మళ్ళీ పరుగులు పెడుతుందన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన ఏరియా నుండి వచ్చే ఫ్యాన్ గాలి వారిని తుడిచిపెట్టేస్తుందన్నారు.కావున ప్రతి ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయండని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు నాయకులు,వైసీపీ కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mani Kumar. B






