మదనపల్లి - అక్టోబర్ 27: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ @ చినబాబు కు మద్దత్తు గా ప్రచారంలో రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, దొమ్మలపాటి యశశ్విరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 39వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థి యం.వి.ఆర్. వెంకట రాయుడు, చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు కోసం ఇంటింటా టిడిపి గెలుపు పట్టణం అభివృద్ధి కి మలుపు అంటూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ మదనపల్లె అభివృద్ధి కోసం సిఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లెకు జిల్లా కేంద్రం ఇచ్చిన ఘనత సిఎం చంద్రబాబునాయుడు దే అని అన్నారు. మదనపల్లె కేంద్రంగా లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం అని అన్నారు. మదనపల్లె అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ సైకిల్ గుర్తు పైన ఓటు వేసి చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు, 39 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వెంకట రాయుడు లను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీరామ్ చినబాబు గెలుపు కోసం రాటకొండ, దొమ్మలపాటి తనయులు శ్రీరామ్ చినబాబు గెలుపు కోసం రాటకొండ, దొమ్మలపాటి తనయులు