రాజకీయ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి

- సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయ ప్రవేశం

- కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మునిసిపల్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ వెల్లడి

మదనపల్లె : కాంగ్రెస్ పార్టీకి పుర ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే పట్టణ రూవురేఖలు మార్పు చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ ప్రకటించారు.సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని సాగించి,ఓటర్లను కలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.కరపత్రాలను పంచి పెడుతూ విద్యావంతుడైన వైద్యుడిగా ప్రజలకు సేవలు అందించి మార్పుకు శ్రీకారం చుట్టాలనే ఆశయంతో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలందరికీ నిజాయితీతో ఇచ్చిన హామీలకు కట్టుబడి బాధ్యతాయుతంగా జవాబు దారితనంతో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.విజ్ఞులైన పుర ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కేవలం ప్రజల కోసం,మార్పు కోసం మహా యజ్ఞం చెపట్టి కాంగ్రెస్ పార్టీ నుండి ఒంటరి పోరాటం చేస్తున్నానని తెలిపారు.పట్టణంలో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ప్రజల మనసును చూరగొనే విధంగా చేసి చూపిస్తామన్నారు.ఈ ప్రయత్నంలో విఫలమైతే ప్రజల సాక్షిగా తప్పుకు నేందుకు కూడా వెనకాడనని ప్రకటించారు.అందుకోసం హస్తం గుర్తుపై ఓటువేసి చైర్మన్ అభ్యర్థిగా గెలిపించాలని ఓటర్లను కోరారు. పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యావంతుడైన డాక్టర్ అప్సర్ షరీఫ్ ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిపిస్తే మదనపల్లె రూపురేఖలు మార్చడంతోపాటు గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చూస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామ కృష్ణారెడ్డి,మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష,సబీహా షరీఫ్,సీనియర్ నాయకులు ఖాదర్ బాషా,సీనియర్ అడ్వకేట్ కే.ఎస్.ఎం షరీఫ్,జిల్లా కార్యదర్శి మంగూ నాయక్,జిల్లా నాయకులు రవి,కార్యకర్తలు పాల్గొన్నారు.