15వ వార్డులో వేడుకను తలపించిన కూటమి ప్రచారం

- జనసేన అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ కి ప్రజలు బ్రహ్మరథం

- హాజరైన కూటమి పార్టీల అతిరథ మహారధులు

మదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు నందు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ ముమ్మర ఎన్నికల ప్రచారం సాగించారు.15వ వార్డు జనసేన అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి జనసేన మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి,స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త రాందాస్ చౌదరి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం,టౌన్ బ్యాంకు చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్,టీడీపీ సీనియర్ నాయకుడు సీడ్ మల్లిఖార్జున నాయుడు,తంబళ్లపల్లి జనసేన నాయకుడు రఘునాథ రెడ్డితోపాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.గాజు గ్లాసుపైన ఓటు వేసి,భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యావంతుడు,యువకుడైన సిరివేలు చరణ్ కుమార్ కౌన్సిలరుగా గెలిస్తే,15వ వార్డు పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు.వార్డు ప్రజలు ఇప్పటికే మద్దతు ప్రకటించారని,కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని మూడు పార్టీల తరపున కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న చరణ్ కుమార్ గెలిస్తే,వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారని పేర్కొన్నారు.కౌన్సిలర్ అభ్యర్థి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో కూటమి తరపున ముఖ్య నాయకులు,కార్యకర్తలు,స్వచ్చంధంగా ప్రజలు పాల్గొన్నారు.

15వ వార్డులో వేడుకను తలపించిన కూటమి ప్రచారం • జనసేన అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ కి ప్రజలు బ్రహ్మరథం