మదనపల్లెలో కన్నుల పండుగలా వాల్మీకి జయంతి వేడుకలు

- హాజరైన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా

- విఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు వెల్లడి 

మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణం నందు సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా,అధికార,ప్రతిపక్ష మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు శ్రీరామ్ చినబాబు,జింక వెంకటా చలపతి,జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరి,టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు.ఇందులో భాగంగా వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,పెద్దఎత్తున ప్రజలకు అన్నదాన కార్యక్రమంనిర్వహించారు.అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ అనుసరించడంతోపాటు భావితరాలకు అందించేలా ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు.మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించాలని గుర్తు చేశారు.వాల్మీకి కూడలిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.విఆర్ఎస్ఎస్ అధ్యక్షులు పొదల నరసింహులు మాట్లాడుతూ వాల్మీకుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం,ఎన్డిఏ పాలకులు సహక రించి,ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.అలాగే వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చి జాతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి అండగా నిలవాలన్నారు.విఆర్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దేవరింటి సుధాకర్ మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్న హామీలు కార్యరూపం దాల్చకుండానే కలగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తద్వారా వాల్మీకి బిడ్డలు విద్య,వైద్య,ఆరోగ్య ఉద్యోగ,ఉపాధి,రంగాలలో వెనుకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎలాంటి ఉపాధి లేని వాల్మీకులకు రిజర్వేషన్ తోనే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహాసేన అధ్యక్షులు నల్లబోతుల సుదర్శన్ బాబు,జిల్లా అధ్యక్షులు మంజునాథ్,నాగినేని గోవిందు,నియోజకవర్గ అధ్యక్షులు గౌరమ్మ,పట్టణ అధ్యక్షురాలు గాయత్రి,వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 మదనపల్లెలో కన్నుల పండుగలా వాల్మీకి జయంతి వేడుకలు • హాజరైన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా • విఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు