తంబళ్లపల్లె - అక్టోబర్ 26 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్థానిక దుర్గామాత భక్తులు, యువకులు, ప్రజలు సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా హరిత సర్కిల్ క్రాస్ రోడ్ లో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు దుర్గామాత కు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు పూజలు నిర్వహించి చాందిని బండి పై ప్రత్యేక వాయిద్య బృందాలు, పానసంచా పేలుళ్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాల తో తంబళ్లపల్లె పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పొందారు

Srivani






