మదనపల్లె, అక్టోబరు 26: ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకుంటే 27.10.2026 మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత నామినేషన్ కేంద్రానికి స్వయంగా హాజరై ఉపసంహరణ పత్రాన్ని సమర్పించాలని అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ లక్ష్మీపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసేందుకు అభ్యర్థులు నిర్ణీత గడువులోగా నేరుగా హాజరై సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఉపసంహరణ పత్రాన్ని అందజేయాలని సూచించారు.
అభ్యర్థులు ఈ గడువును గమనించి, నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు.

Murali. K






