మదనపల్లెలో దైవదర్శనంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుమదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (శ్రీరామ్ చినబాబు) పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే క్రమంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కృపతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.దైవదర్శనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Rukmini M






