మదనపల్లెలో CSI చర్చిని సందర్శించిన కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు దైవసన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆశీస్సులు పొందిన చినబాబు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె:
మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (శ్రీరామ్ చినబాబు) CSI చర్చిని సందర్శించి, దైవసన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభువును ప్రార్థిస్తూ దైవాశీస్సులు పొందారు.ఈ సందర్భంగా దేవుని కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ప్రజాసేవలో ముందుకు సాగేందుకు దైవబలం, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ చినబాబు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.


Rukmini M






